BREAKING
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జ్యోతి భా పూలే విద్యాలయ విద్యార్థుల ప్రతిభ “శనగ పంటలో విత్తన శుద్ధి తప్పనిసరి ”: సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహనరావు రావంగ్లా బుద్ధ పార్క్‌లో లైట్ అండ్ సౌండ్ షో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ మైనస్ చేసి కొత్త ఇండస్ట్రీ ఫామ్ చేశాం: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు! నషా ముక్త్ భారత్ మద్దతుగా కిషన్ రెడ్డి మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం ఎన్‌బీఎఫ్‌సీ రుణ డిమాండ్‌కు బలమైన ఆర్థిక వృద్ధి, విధానాల మద్దతు మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. కొరియన్ యువతి హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ గల్లా వివాహం! వచ్చే ఏడాది నుంచి హెచ్ఐవీ కేసులు పెరిగే ప్రమాదం అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి - కలెక్టర్ రాజర్షి షా ఎరువుల కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి మహేష్ బాబు షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్‌పై చైనా విచారణ మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట చదువుకున్న నాయకత్వం ... అభివృద్ధికి కొత్త దిశ! ఉల్లిపాలెం సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఈమని అవినాష్ . విద్యార్హతలతో ప్రజాక్షేత్రంలోకి . గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమంటూ విస్తృత ప్రచారం ఆకాశంలో ఒక తార సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు.. ఏమన్నారంటే? ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా

దర్శకులకే కాదు ప్రతి మనిషికి కథలు ఊపిరి

Select Suryaa Now
దర్శకులకే కాదు ప్రతి మనిషికి కథలు ఊపిరి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ 2026 వేదికగా ప్రముఖ రొమేనియన్ రచయిత, దర్శకుడు, నిర్మాత బోగ్డాన్ మురెసాను ప్రత్యేక మాస్టర్‌క్లాస్ నిర్వహించారు. వాస్తవికత, కల్పన మధ్య సన్నని రేఖ అనే అంశంపై జరిగిన ఈ సెషన్‌లో సినీ ప్రియులు, విద్యార్థులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. కథ చెప్పడం అనేది కేవలం దర్శకులు లేదా కళాకారులకే పరిమితమైన అంశం కాదని, ప్రతి మనిషి జీవితంలోనూ కథలు ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. స్నేహితుల మధ్య పంచుకునే సాధారణ మాటల నుంచి వెండితెరపై చూసే కథల వరకు అన్నీ మనుషులు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, కొత్త కోణాలను ఊహించుకోవడానికి, మానసికంగా పునరుజ్జీవం పొందడానికి తోడ్పడతాయని వివరించారు. సినిమా రూపకల్పన తొలుత ఒక వ్యక్తిగత ప్రయాణంగా మొదలైనా, ప్రేక్షకుల భాగస్వామ్యం, వారి కోణాలతో అది ఒక సమష్టి అనుభవంగా మారుతుందని, మనసులోని ఏకపాత్రాభినయం సంభాషణగా మారినప్పుడు ఆ సినిమా ఇక దర్శకుడిది మాత్రమే కాదని బోగ్డాన్ మురెసాను అన్నారు.

సినిమా నిర్మాణ శిల్పం గురించి మాట్లాడిన ఆయన, బలమైన ప్రధాన ఆలోచన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అనేక ఉపకథలు, మలుపులకు అవకాశం ఉండే నవల మాదిరిగా కాకుండా, రెండు గంటల నిడివి ఉండే సినిమా ఒక స్పష్టమైన దృష్టితో, కేంద్రీకృత కథాంశంతో సాగాలని సూచించారు. కథనంలో తెరపై కనిపించని, చెప్పని అంశాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తన చిత్రాల్లోని ఒక సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఓ పాత్ర టపాసు కాల్చే దృశ్యాన్ని నేరుగా చూపించకుండా ప్రేక్షకుల ఊహకే వదిలేసిన విషయాన్ని ప్రస్తావించారు. తెరపై ప్రతిదీ చూపించకుండా ఇలాంటి సంయమనం పాటించడం వల్ల ప్రేక్షకులు కథలో భావోద్వేగపరంగా మరింతగా లీనమవుతారని ఆయన పేర్కొన్నారు.

చరిత్రకు సంబంధించిన ఆర్కైవల్ ఫుటేజీ పూర్తిగా నిష్పాక్షికమైనది అనే భావనను ఆయన ప్రశ్నించారు. ప్రతి కెమెరా ఒక నిర్దిష్ట కోణాన్ని మాత్రమే బంధిస్తుందని, ఆర్కైవల్ దృశ్యాలు మరియు కల్పన కథనాలు కలిసి పనిచేసినప్పుడు వాస్తవికతను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చని తన చిత్రాల ఆధారంగా వివరించారు. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కల్పన ఒక సరళమైన నమూనాగా పనిచేసినప్పుడు, అది వాస్తవంతో కలిసిపోయి పరస్పరం బలపడతాయని చెప్పారు. కథకు దృశ్య భాష ఎంతో కీలకమని, రొమేనియా కమ్యూనిస్ట్ కాలం నేపథ్య చిత్రాల్లో సన్నిహిత వాతావరణం కోసం ఫోర్ ఈజ్ టు త్రీ యాస్పెక్ట్ రేషియోను వాడినట్లు, అదే సమయంలో తన యానిమేటెడ్ లఘు చిత్రంలో విస్తృత ఫ్రేమ్ ద్వారా నౌకాశ్రయానికి కథలో కీలక పాత్ర కల్పించినట్లు తెలిపారు.

నేటి సినిమాల్లో వేగం లేదా భారీ హంగుల కంటే, మానవ ముఖంలోని హావభావాలు, చూపుల ద్వారా పలికే భావోద్వేగాలే అసలైన బలమని మురెసాను అభిప్రాయపడ్డారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా బయోపిక్‌లు, పౌరాణిక గాథలు, నిజజీవిత వ్యక్తుల చిత్రీకరణలో నైతిక బాధ్యతలపై చర్చ జరిగింది. ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్ర తీసే అవకాశం వచ్చినప్పుడు, జీవితమంతా కాకుండా వారి జీవితంలోని ఒక కీలక ఘట్టంపై దృష్టి పెడితే లోతైన నిజాలు బయటపడతాయని సూచించారు. సొంత మూలాలను మర్చిపోకుండా, విశాల ప్రపంచంతో మమేకమవుతూ ధైర్యంగా, స్పష్టతతో కథలు చెప్పాలని యువ కథకులకు పిలుపునిచ్చారు.