BREAKING
టాక్సిక్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ మూవీ.. వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే? తెలంగాణలో Grain Silos అత్యాధునిక శైలిలో ధాన్యం నిల్వ: మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌!

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ

Select Suryaa Now
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ

జాతీయ అవార్డు అందుకున్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక ఘనత చేరింది. ఈసారి ఏకంగా ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ మెరిశారు. స్టైలిష్ లుక్‌తో కనిపించిన ఆయన ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘షోస్టాపర్స్ 2026’ పేరుతో ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రభావం చూపిన 100 మంది ప్రముఖులను ఈ జాబితాలో చోటు కల్పించారు.

ఈ ప్రత్యేక సంచికలో అల్లు అర్జున్‌కు స్థానం దక్కడమే కాకుండా.. కవర్ స్టార్‌గా కనిపించడం ఆయన క్రేజ్‌కు మరో నిదర్శనంగా నిలిచింది. తనదైన స్టైల్, ఆకట్టుకునే లుక్‌తో బన్నీ కవర్‌పై సందడి చేశారు.

ఈ సందర్భంగా సినిమా రంగంలో వస్తున్న మార్పులు, కథల ప్రాధాన్యతపై అల్లు అర్జున్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా ఉత్తరాదిదైనా, దక్షిణాదిదైనా లేదా ఏ ప్రాంతానికి చెందినదైనా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథే అసలైన బలం అని ఆయన అభిప్రాయపడ్డారు.

భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని బన్నీ పేర్కొన్నారు. కొత్తదనంతో కూడిన కథను ప్రేక్షకులకు అందించడం చాలా ముఖ్యమని చెప్పారు.

అంతేకాదు.. సినిమాలో నటీనటుల స్టార్‌డమ్ కంటే కథే విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశం అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. దీంతో ఫోర్బ్స్ కవర్‌పై మెరవడంతో పాటు తన సినిమా ఆలోచనలతోనూ బన్నీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.