BREAKING
చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు కాంగ్రెస్ పథకాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

అమెరికాలో లక్కవరపుకోట వాసికి అరుదైన గౌరవం:

Select Suryaa Now
అమెరికాలో లక్కవరపుకోట వాసికి అరుదైన గౌరవం:

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామానికి చెందిన కోసూరి తాతారావు అమెరికాలోని ప్రముఖ తెలుగు స్వచ్ఛంద సంస్థ 'తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా' (TSN) నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మాతృభాషపై మక్కువతో, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు TSN సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందిస్తోంది. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధ్యక్ష బాధ్యతలు సొంత ప్రాంత వ్యక్తికి దక్కడం పట్ల గంగుబూడి గ్రామంలోనూ, లక్కవరపుకోట మండల వ్యాప్తంగానూ ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. భాషా సంస్కృతుల పరిరక్షణతో పాటు స్థానిక యువతకు విద్యా, ఉద్యోగ మార్గదర్శకత్వం అందించడం, పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించడం లాంటి సేవా కార్యక్రమాలు ఈ సంస్థ చేపడుతుంది