BREAKING
రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు! జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి

డెన్వర్ ఎయిర్‌పోర్టులో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెనుప్రమాదం

Select Suryaa Now
డెన్వర్ ఎయిర్‌పోర్టులో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన పెనుప్రమాదం

సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో పాటు బ్రేకులకు మంటలు అంటుకున్నాయి. ఈ ఊహించని పరిణామాతో విమానాశ్రయ సిబ్బంది మరియు ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అప్రమత్తమైన పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని నిలిపివేయగా, సిబ్బంది అత్యవసర తరుణంలో తక్షణ చర్యలు చేపట్టారు. విమానంలోని ఎమర్జెన్సీ స్లైడ్స్‌ను తెరిచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న మొత్తం 173 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ఈ హఠాత్పరిణామంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక మరియు రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని బ్రేకులకు అంటుకున్న మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విమానాశ్రయ అధికారులు మరియు విమానయాన భద్రతా నిపుణులు దర్యాప్తు జరుపుతున్నారు.