రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం
గూడూరు, మేజర్‌న్యూస్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అద్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఎంఎల్‌ఏ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్ సాదర స్వాగతం పలికారు. తిరుపతి నుండి విజయవాడ వెళుతున్న రాష్ట్ర అధ్యక్షుడికి బుధవారం ఉదయం 16వ నంబర్ జాతీయ రహదారిపై బూధనం గ్రామం వద్ద మర్యాద పూర్వకంగా కలసి నియోజకవర్గంలో పలు సమస్యలను, స్థానిక ఎన్నికలపై పలు విషయాలను వారితో చర్చించినట్లు తెలిపారు. ఆయన వెంట బిల్లు చెంచురామయ్య, అబ్దుల్ రహీం, శీలం కిరణ్‌కుమార్, చిట్టేటి నారాయణ, దిలీప్‌రెడ్డి, చంద్రమౌళినాయుడు తదితరులు ఉన్నారు.