BREAKING
రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి టాలీవుడ్‌లో హీరో విజయ్ తనయుడి ఎంట్రీ: దర్శకుడిగా మారుతున్న జేసన్ సంజయ్‌కు సూర్య ప్రత్యేక శుభాకాంక్షలు నికర లాభాల బోనస్ ప్రకటించాలి టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం

Select Suryaa Now
మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :  కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారంనాడు బుజబుజ నెల్లూరు, నక్కల కాలనీలోని ఆస్థాన శిష్టియ వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా పి.హెచ్.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ....అమెరికాలో ఉద్యోగం సాధించిన వెలినేని లక్ష్మీప్రియ తన మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీస్సులు పొందారు. తన తొలి సంపాదనలో కొంత భాగాన్ని వృద్ధుల సేవకు వినియోగించడం ద్వారా లక్ష్మీప్రియ సేవాభావాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అవసరమైన వారికి అందించాలని, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జయప్రకాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జిల్లా పీ.హెచ్.పీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, వల్లటూరు పార్వతి, యాకశిరి శైలజ, వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆసిఫ్ భాష తదితరులు పాల్గొన్నారు.