అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం
పొట్టేపాలెం కలుజును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి ని అక్టోబర్ 2వ తేదీ, ఉదయం 9:33 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 2వ తేదీ, ఉదయం 9:33 గంటలకు కలుజుపై బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.అలాగే పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలతో పాటు కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల ప్రజలకు ఎంతో కీలకమైన అనుసంధాన మార్గం. బాంబే రోడ్డుకు ప్రత్యామ్నాయ అనుసంధాన రహదారిగా ఈ మార్గం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో కలుజుపై వరద నీరు చేరడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సందర్భాలు అనేకం. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలి అనే ఉద్దేశంతో పొట్టేపాళెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణం గురించి గత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక పోరాటాలు చేసారు.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలుజుపై బ్రిడ్జి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మంజూరుచేసారు.అలాగే ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయించి పనులను పూర్తి చేయడం జరిగింది.అలాగే భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు రాకపోకల విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా కలుజుపై బ్రిడ్జి నిర్మించాం. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ ఛైర్మెన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టీడీపీ నాయకులు పవన్ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.