నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి
దర్శి మేజర్ న్యూస్. నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలలో టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. 10.00 లకు కురిచేడు మండలం, పడమర కాశిపురం గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.11.00 లకు కల్లూరు టు వెల్లంపల్లి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.12.15 లకు దర్శి లోని టిడిపి కార్యాలయం నందు పి ఎం ఏ వై- 2.O పథకం ద్వారా నూతనంగా మంజూరైనా లబ్ధిదారులకు గృహ నిర్మాణ పత్రాలు అందజేస్తారు. నియోజకవర్గంలోని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని టిడిపి కార్యాలయం ఇన్చార్జి ఎస్ వి రామయ్య కోరారు.