BREAKING
సమాజానికి అవసరమైన వార్త కథనాలను ప్రచురించాలి .. మీడియా అకాడమీ చైర్మన్ కి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఎయిర్ ఇండియా నూతన సీఈవోగా తెవోల్డే గెబ్రెమరియం నియామకానికి కేంద్రం సెక్యూరిటీ క్లియరెన్స్ తీర ప్రాంతాల రక్షణకు 'నేషనల్ కోస్టల్ మిషన్ 2.0' దేశంలో వైద్యరంగ విప్లవం, లక్షా ఎనభై ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు రాష్ట్రపతి భవన్‌లో అక్టోబర్ 3న గార్డ్ మార్పిడి వేడుక రద్దు 37 ఏళ్ల పోలీస్‌ సేవలకు వీడ్కోలు – రిటైర్డ్‌ పోలీసు అధికారులకు సన్మానం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ రక్షణ భూముల యాజమాన్యంలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యవసరం స్విమ్స్‌లో అధునాతన శస్త్రచికిత్స -60 ఏళ్ల మహిళకు ప్రాణాలు నిలిపిన వైద్యులు ప్రయాణికుల ఆరోగ్య రక్షణే ధ్యేయం: బెంగాల్‌లో 7,300కు పైగా నీటి ట్యాంకులను శుభ్రం చేసిన ఈస్టర్న్ రైల్వే.. మెకానికల్ స్వీపింగ్‌కు సీఎం రేఖా గుప్తా పెద్దపీట ఆసియా క్రీడల మహిళల హాకీ ఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ విజయం ఆసియా క్రీడల్లో స్వర్ణాల మోత, ఆర్చరీలో భారత్‌కు మరో మూడు పసిడి పతకాలు పడిపోయిన స్టాక్ మార్కెట్లు

భీమిలిలో అభివృద్ధికి బాట..

Select Suryaa Now
భీమిలిలో అభివృద్ధికి బాట..

 

పద్మనాభం మండలంలో 3 రోడ్లకు ఎమ్మెల్యే గంటా వర్చువల్ శంకుస్థాపన..

భారీగా హాజరైన టిడిపి పార్టీ శ్రేణులు..

ఆనందపురం, సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్:

ఈరోజు 30-09-2026 వ తేదీన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో ఆనందపురం మండల కాంప్లెక్స్ వద్ద పద్మనాభం మండలంలోని 3 ముఖ్యమైన రోడ్డు పనులకు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ 3 పనులకు మొత్తం రూ. 2 కోట్ల 23 లక్షల నిధులు మంజూరయ్యాయి.

శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

1. పొట్నూరు గ్రామం: గుల మజ్జివాని కల్లాలకు తారు రోడ్డు నిర్మాణం - రూ. 70 లక్షలు

2. పాండ్రంగి గ్రామం: సిడత గట్టు రోడ్డు నిర్మాణం - రూ. 73 లక్షలు

3. మద్ది గ్రామం: తునిపొలం రోడ్డు నిర్మాణం - రూ. 80 లక్షలు

ఆనందపురం మండల కాంప్లెక్స్ నుండి వర్చువల్ విధానంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ల నిర్మాణంతో ఆయా గ్రామాల రైతులకు, ప్రజలకు రాకపోకల సమస్య తీరడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు సులభం అవుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చిక్కాల విజయ్ బాబు, టీడీపీ పద్మనాభం మండల అధ్యక్షులు కోరాడ రమణ, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కాళ్ళ నగేష్ కుమార్, పద్మనాభం మండల క్లస్టర్-1 మజ్జి నందీశ్వరరావు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.