జిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక
చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టైక్వాండో, టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. బుధవారం ఎంఆర్ పల్లి లోని ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్-14, 17,19 బాల బాలికల టైక్వాండో జిల్లా జట్లును ప్రధానోపాధ్యాయులు హరినాథ్ రెడ్డి, పీడీ హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించారు.అలాగే చిగురువాడలోని అకార్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అండర్-14, 17,19 జిల్లాస్థాయి టెన్నిస్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోమిథున్ శాలి, గ్రాండ్ మాస్టర్ కె.వి బాబురావు, కోచస్ బాలకృష్ణ, వరప్రసాద్, అవినాష్, సురేష్, అనిల్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి