ఏలూరు,మేజర్ న్యూస్ : జిల్లాలో పేదలకు సేవలో 2. O కార్యక్రమంలో భాగంలో ప్రతీ నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్రముఖ్యమంత్రి నారా
ఏలూరు,మేజర్ న్యూస్ : జిల్లాలో పేదలకు సేవలో 2. O కార్యక్రమంలో భాగంలో ప్రతీ నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తెలిపారు. పేదలకు సేవలో 2. O, పీ4, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు నిరంతర ప్రక్రియగా సాగాలన్నారు. , సంక్షేమ కార్యక్రమాలతో పాటు పీ4 కార్యక్రమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి అమలు జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి తల్లికి వందనం, దీపం పధకం, స్త్రీ శక్తీ, పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పధకాలు అందుతున్నాయని, వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. కలెక్టర్లు, నోడల్ అధికారులు నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనపై దృష్టి పెట్టాలన్నారు. పేదరికం, ఆర్థిక అసమానతలు లేని దిశగా నియోజకవర్గాలను తీర్చిదిద్దాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సీఎం చెప్పారు. పౌర సేవల్ని సమర్ధంగా అందించటం ద్వారా పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ వచ్చేలా చూడాలని, పాలనకు టెక్నాలజీని వినియోగిస్తే... పౌర సేవలు మరింత సులభతరంగా అందించవచ్చన్నారు. స్వర్ణాంధ్రలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతీ ఏటా అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర అవార్డుల కార్యక్రమం చేపడతామని, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకూ వివిధ కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటిస్తామన్నారు.ఏలూరు జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పేదలకు సేవలో 2. O,కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో అక్టోబర్ 1వ తేదీన ప్రతీ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులతో పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రతీ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి స్థానిక శాసనభ్యులు, ప్రత్యేక అధికారులతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.