BREAKING
‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే!

విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం.

Select Suryaa Now
విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం.  జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం.

పలాస, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్.

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఉపాధ్యాయురాలు టి. సంధ్యారాణికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం గర్వకారణమని ఎంఈవో సీహెచ్. శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు సైని వల్లభ కొనియాడారు.పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి,సూదికొండ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సంధ్యారాణి ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాల ఆవరణలో స్థానికులు,తోటి ఉపాధ్యాయులు ఆమెకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సంధ్యారాణి నిబద్ధత,అంకితభావం ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమన్నారు.భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకొని మండలానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.ఢిల్లీశ్వరరావు,ఉపాధ్యాయులు జోగ తిరుపతి,దాసరి చిన్నారావు, రేణుక, పద్మకుమారి, హేమలత, ఆశారాణి,ఎస్‌ఎంసీ చైర్మన్ బి.పూజ, వైస్ చైర్మన్ ఎం.ఈశ్వరి,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.