జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి
సూర్యా ప్రతినిధి, ఇల్లందు :
జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలని టి యు సి ఐ జిల్లా కార్యదర్శి షేకియాకుబ్ షా వలి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో లేబర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ కనీస వేతనాల జీవోలలో 67 జీవోలను ఒకే గొడుగు కిందికి చేస్తూ కనీస వేతనాలు జీవో నెంబర్ 6 2026 జూన్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో కొన్ని కోట్ల కు పైగా కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. నాలుగు నెలలు గడిచిన ఏ ఒక్కరికి జీవో అమలు కాలేదు అన్నారు. మున్సిపాలిటీలోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు కు ఐదు నుండి వెయ్యి రూపాయల వరకు జీతం కట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి నాలుగు కేటగిరీలుగా చేశారని ఇప్పటికైనా వేతనాన్ని గ్రామపంచాయతీ కార్మికులకు, రైస్ మిల్, దుకాణ కార్మికులు, పెట్రోల్ బంక్, హోటల్స్, రెస్టారెంట్లు, కాలేజీ హాస్టల్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ప్రైవేట్ మోటార్, కెమికల్ ఫ్యాక్టరీస్, క్యాంటీన్, వాటర్ ప్లాంట్ లు, పౌల్ట్రీ ఫామ్ లు, నాన్ టీచింగ్ స్టాఫ్ లు, ఆటోమొబైల్స్, రోడ్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్, సెక్యూరిటీ గార్డులు, అగ్రికల్చర్, బంగారం, స్వీట్ దుకాణ సముదాయాలు, నర్సింగ్ హోమ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, గ్లాస్ ఇండస్ట్రీ, డైరీ ఫామ్ లు, ప్రింటింగ్ ప్రెస్ లు, కో-ఆపరేటివ్ సొసైటీలు తదిత రంగాలకు చెందిన కార్మికులకు జీవో నెంబర్ 6 వర్తిస్తుందన్నారు. వెంటనే జీవోను అమలు చేసి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రాంసింగ్, నాయకులు పాయం వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు, వేముల గురునాథం శేషయ్య ,సంపత్, దుర్గ ,మహేష్, కుమార్ ,వెంకన్న, రామచందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సూర్య రూరల్ రిపోర్టర్ ఇల్లందు డానియల్