శానిటేషన్ వర్కర్లకు వైద్య పరీక్షలు
శానిటేషన్ వర్కర్లకు వైద్య పరీక్షలు
రాప్తాడు మేజర్ న్యూస్:
స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో, మండల పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలో శానిటేషన్ వర్కర్లకు బుధవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి శివకృష్ణ, ఎంపీడీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శానిటేషన్ వర్కర్లకు బీపీ, షుగర్, హీమోగ్లోబిన్‌తో పాటు పలు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్కర్లకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శివప్రసాద్, నరసింహ, లక్ష్మీనరసమ్మ, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, శమంతకమణి, లక్ష్మి,జాన్సీ, రామాంజనమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.