BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఎం.ఎం.హళ్లిలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక సహాయం రాజ్‌కుమార్ రావ్ ప్రహార్ సినిమాలో అజ్మల్ కసబ్ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటుడు లలిత్ ప్రభాకర్ విశేషాలు పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి... సర్ ప్రక్రియను నిలిపివేసి...తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి:సిపిఐజిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ధర్మవరం 42వ వార్డులో ఉచిత సామాజిక వైద్య శిబిరం పంటలను ఎండబెట్టి... రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసింది:బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 150వ వసంత వేడుకల్లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లో ఆ ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం.. కెమెరా ముందుకు వచ్చి ఫొటోలకు ఫోజులు బేతపల్లిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ వీఆర్ఏల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలి: పీడీఎస్‌యూ దుపహియా సీజన్ 2 లో పరీక్షల లీకేజ్ కథాంశంపై భయపడ్డాం.. మేకర్ల ఆసక్తికర వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌లో ఉద్రిక్తంగా విద్యార్థి నిరసనలు

Select Suryaa Now
ఫ్రాన్స్‌లో ఉద్రిక్తంగా విద్యార్థి నిరసనలు

సూర్య అంతర్జాతీయ వార్తలు: ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత మరియు ఉపాధ్యాయుల లోటును నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా వివిధ హైస్కూళ్ల విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు, భద్రతా సిబ్బంది గాయపడినట్లు దేశ విద్యాశాఖ మంత్రి ఎౌవార్డ్ గెఫ్రే వెల్లడించారు. తరగతి గదుల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించాలని, ఉపాధ్యాయుల కొరతను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఈ ఆందోళనకు దిగారు.

పారిస్ పరిసర ప్రాంతాలతో పాటు లీల్, లియాన్, గ్రెనోబుల్, నైస్ తదితర ప్రధాన నగరాల్లోని సుమారు 180కి పైగా పాఠశాలల్లో ఈ నిరసనల ప్రభావం పడింది. పలు పాఠశాలల ప్రవేశ ద్వారాలను విద్యార్థులు దిగ్బంధించగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల్లో కొందరు ఆందోళనకారులు చెత్తబుట్టలకు నిప్పు పెట్టడం, పోలీసులపై రాళ్లు మరియు సీసాలతో దాడి చేయడంతో భద్రతా బలగాలు బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘటనలో వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన రాబోయే బడ్జెట్ కోతలు మరియు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ విద్యార్థి ఆందోళనలు మరింత జోరందుకున్నాయి. విద్యార్థుల భద్రతను కాపాడేందుకు, పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ నిరసనలు ప్రభుత్వానికి పెనుసవాటుగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.