ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని పలివెల గ్రామానికి చెందిన గీసుకొండ ముత్తయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి తన వంతు సహాయంగా రూ 10,000/- ఆర్థిక సహాయం పంపించి మానవత్వం చాటుకున్నారు.అట్టి డబ్బులను గ్రామశాఖ అధ్యక్షుడు అనగంటీ కృష్ణ కొండ ముత్తయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను మనో ధైర్యం కల్పించారు.ఆర్థిక తీసుకున్న కుటుంబ సభ్యులు కుంభం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకుపల్లి వెంకటయ్య, మాజీ సర్పంచ్ చెరుకు పద్మ జనార్ధన్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆనగంటి కృష్ణ, ఉపసర్పంచ్ చెరుకు సునీత సైదులు, వార్డ్ సభ్యులు బత్తుల ప్రవీణ్, గోసుకొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ జాల వెంకన్న, గోసుకొండ శంకర్, బాసర యాదగిరి, కొండూరు మల్లికార్జున, గోసుకొండ కృష్ణయ్య, గోస్కొండ వెంకులు, బాసరాజు యాదయ్య, బాసర సత్తయ్య, గోస్కొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.