BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం..

Select Suryaa Now
అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై  ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం..

శ్రీకాకుళం సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్–2.0’ పథకం కింద రూ.55.74 కోట్ల నిధులు మంజూరు చేయడంపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల సాధనకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి, పట్టుదలతో శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక కీర్తి ప్రతీకగా ఉన్న అరసవల్లి పుణ్యక్షేత్రం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడిందన్నారు. అరసవల్లి అభివృద్ధికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌లకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి అరసవల్లికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మంజూరైన నిధులతో ఆలయ పరిసరాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, విశ్రాంతి ప్రాంగణాలు, తాగునీటి వసతులు, క్యూలైన్లు, పరిసరాల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్గదర్శకత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. రథసప్తమి వంటి ప్రధాన పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

అరసవల్లి అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన రూ.55.74 కోట్ల నిధులు శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక, పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తాయని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.