మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం
సైదాపురం మండలం మేజర్ న్యూస్ : సైదాపురం మండలంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ముందస్తు సమాచారం లేకుండా, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా అధికారులు కలిచేడు గ్రామ పరిధిలోని రాఘవేంద్ర మైన్‌ను పరిశీలించారు. అనంతరం సైదాపురం మండలంలోని మరికొన్ని మైన్లతో పాటు గూడూరు నియోజకవర్గ పరిధిలోని కందాలి,మైన్‌ను కూడా పరిశీలించినట్లు సమాచారం.తనిఖీల్లో మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ శ్రీ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్, నెల్లూరు డీఎంజీఓ కె. శ్రీనివాసరావు, గూడూరు అసిస్టెంట్ జియాలజిస్ట్ టి. సుబ్బారాయుడు, నెల్లూరు మినరల్ రెవెన్యూ ఆఫీసర్ కె. సురేష్‌కుమార్, సూపర్‌వైజర్ ఎం. సుధాకర్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అధికారులు తనిఖీలు పూర్తిచేసుకుని వెళ్లిపోయారు. తనిఖీలకు గల కారణాలు, పరిశీలించిన అంశాలపై అధికారులుమీడియా కి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.