BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు వ్యాపారులకు ఊరట: యూపీఐ లావాదేవీలపై 0.28% ఎండీఆర్ మాఫీని పరిశీలిస్తున్న ఇండియన్ బ్యాంక్.. ఎండీ & సీఈవో బినోద్ కుమార్ వెల్లడి! ‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం

నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి*

Select Suryaa Now
నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి*

 

*నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి*

*రీ-సర్వే, 22ఏ, ఈ-ఆఫీస్, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి*

*హౌసింగ్‌ లబ్ధిదారుల వివరాలు, ఖాళీ స్థలాలపై సమగ్ర నివేదిక వారం లోపు సిద్ధం చేయాలి*

*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు, సెప్టెంబర్ 30: నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనులలో పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు..

బుధవారం రెవెన్యూ, హౌసింగ్ సైట్ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రీ-సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించి, విలేజ్ సర్వేయర్, వీఆర్వో  లాగిన్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని కలెక్టర్ సర్వే ఏడి ని ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్-3లో పెండింగ్‌లో ఉన్న DLRలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు, ఫేజ్-4 పనులను తహశీల్దార్ లాగిన్ స్థాయి నుంచి వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. అదే విధంగా 44 గ్రామాలకు సంబంధించిన ఫేజ్-6 రీ-సర్వే పనుల్లో సుమారు 8,000 ఎకరాలలో గ్రౌండ్ ట్రూథింగ్‌ పూర్తైన నేపథ్యంలో, మిగిలిన పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు..

బల్క్ ఇష్యూస్, ఈ-ఆఫీస్, 22ఏ భూములు, ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్ తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన పురోగతి గురించి తెలుసుకొని కలెక్టర్ సంబంధిత అధికారులకు  పలు సూచనలు జారీ చేశారు.. ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్‌కు సంబంధించిన మార్పులను వెబ్‌ల్యాండ్‌లో కూడా తప్పనిసరిగా నమోదు చేసి, అప్‌డేట్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

హౌసింగ్ కి సంబంధించి జిల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, అర్హులైన లబ్ధిదారులు, నిర్మాణాల పురోగతిపై సమగ్ర వివరాలను వారం రోజుల్లోగా సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు.. ప్రతి లేఅవుట్‌లో హౌస్‌ సైట్‌ ఎవరికి కేటాయించారు, సదరు లబ్ధిదారు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారా, స్థలం ఖాళీగా ఉందా, నిర్మాణం ప్రారంభించారా, పాక్షికంగా పూర్తయిందా లేదా పూర్తిగా పూర్తయిందా అనే వివరాలను ఎన్యూమరేట్‌ చేసి నమోదు చేయాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌస్‌ సైట్లను గుర్తించి, కొత్తగా హౌస్‌ సైట్‌కు అర్హత కలిగిన, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులను వాటికి అనుసంధానం చేయాలన్నారు. అర్హులైన వారికి కేటాయించేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేని పక్షంలో, అవసరమైన భూసేకరణ (Land Acquisition) చేపట్టేందుకు ఎంత భూమి అవసరం, ఎన్ని ఎకరాలు అవసరం, అందుకు ఎంత నిధులు అవసరమవుతాయనే వివరాలను సేకరించాలన్నారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బల్క్ ఇష్యూస్, ఈ-ఆఫీస్, 22ఏ భూములు, ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్, రీ సర్వే, హౌసింగ్ తదితర అంశాలపై తహసిల్దార్ లతో క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించి, పురోగతి గురించి ఆరా తీసి తహసిల్దార్ లకు పలు ఆదేశాలు జారీ చేశారు..

టెలి కాన్ఫరెన్స్ లో  డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ , కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, తదితరులు పాల్గొన్్నారు