పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు పట్టణం నుంచి నెల్లూరు వెళ్లే పంబలేరు వైపు రహదారిని ఎంఎల్ఏ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పరిశీలించారు. బుధవారం దయం పంబలేరు బ్రిడ్జ్ గుంతల మయంగా ఉన్న రోడ్డు వలన ప్రయాణికుల రాకపోకలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అధికారులకు కాంట్రాక్టర్లకు తెలిపి గుంతల మయంగా ఉన్న రోడ్‌ను మరమ్మత్తులు చేయమని తెలిపారు. దీంతో అధికారులు మరమ్మతులకు చర్యలు తీసుకుని గుంతలను పూడ్చి తదుపరి పనులకు వీలైనంత త్వరగా మంజూరు అయిన నిధులతో బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఎంఎల్‌ఏ సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బి అధికారులు తెలుగుదేశం నాయకులు బిల్లు చెంచురామయ్య, శీలం కిరణ్‌కుమార్, అబ్దుల్ రహీం, చిట్టేటి నారాయణ, చంద్రమౌళినాయుడు, డేగ సురేష్, తదితరులు పాల్గొన్నారు.