తిరువెంగలాయి పల్లెలో అంగన్వాడి వారోత్సవాలు
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు మండలం తిరువెంగళ్లాయపల్లి అరుంధతి వాడలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా అంగన్‌వాడి మాసోత్సవం నిర్వహించారు. బుధవారం తిరువెంగనాయపల్లి అరుంధతి వాడలో సూపర్ వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఐసిడియస్ సిడిపిఓ ఎస్‌కె మహబూభి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోషణ నిచ్చే ఆహార పద్దర్ధాలు తీసుకోవాలని తల్లులకు అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమం లో సూపరవైజర్ లు అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆయమ్మ ఆశ, తల్లులు పాల్గొనడం జరిగింది. అనంతరం కార్యకర్తలు, ఆయాలని,శాలువాలతో ఘనంగా సత్కరించారు.