వర్కింగ్ జర్నలిస్టు సభ్యునిగా 'లాభాన'కు అరుదైన గౌరవం.!
మెరకముడిదాం సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజె నుంచి "లాబాన శ్రీనివాసరావు" కు అరుదైన గౌరవం దక్కింది.ఈయన స్వస్థలం మెరక ముడిదాం మండలం గర్భాం గ్రామం. ఈయనకు చిన్ననాటి నుండి ఫోటోగ్రాఫర్ పై ఎనలేని మక్కువ ఉండేది. ఆ మక్కువ తో వృత్తి పట్ల నిభద్ధతతో పనిచేసి అంచెంచలగా ఎదిగిన లాభాన ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సభ్యునిగా బుధవారం విజయనగరం లో జరిగిన కార్యక్రమంలో పదవిని అలంకరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న లాభానకు ఇలాంటి పదవులు ఇదివరలో ఎన్నోవరించాయి. జర్నలిస్టుగా విభిన్న కోణాల్లో పనిచేస్తున్న లాబాన సినిమా ఇండస్ట్రీ లో పేరుగాంచిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చోటా కె నాయుడు వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన లాభానను రాష్ట్ర, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు బుధవారం సన్మానించారు. నూతన పదవీ స్వీకారం చేసిన లాభాలకు సహచర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రింట్ మీడియా జర్నలిస్టులు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.