BREAKING
చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు కాంగ్రెస్ పథకాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

దశాబ్దాల తరబడి నివాసం ఉన్నవారికి

Select Suryaa Now
దశాబ్దాల తరబడి నివాసం ఉన్నవారికి

 నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలి - సిపిఎం పార్టీ రూరల్ కమిటీ డిమాండ్.

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అపోలో సెంటర్, జక్కా వెంకయ్య భవన్ నందు పత్రిక విలేకరుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ.... నెల్లూరురూరల్ పరిధిలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు  చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్స్ నందు గత 20 ,30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను నిషేధిత జాబితా నుండి తొలగించి ,రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, ఇళ్ల స్థలాలు పట్టాలు లేని వారికి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 20 రోజుల నుండి అనేక ప్రాంతాలలో ఈ సమస్యపై ఆందోళన నిర్వహిస్తున్నాము . ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలతోటే అనేకమంది మహిళలు వారికి ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలని, ఇల్లు ,ఇళ్ల స్థలాలు లేని వారికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వేలాదిమంది తహసిల్దార్ కార్యాలయం వద్ద, సచివాలయాల వద్ద అర్జీలు ఇచ్చి ఉన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేని చోట రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేసే దానికి అంగీకరించారు .విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాలలో ఇప్పటికే ప్రభుత్వం అనేకమందికి రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేసింది. కానీ నెల్లూరు రూరల్ పరిధిలో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న, సంవత్సరాల తరబడి అధికారులు చుట్టూ తిరుగుతున్న రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్దుల్ అజీజ్ ,కట్టా సతీష్ ,అజీజ్. ఎస్ కే నజీర్.తదితరులు పాల్గొన్నారు .