BREAKING
చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జోన్ల వారీగా సమావేశాలు కాంగ్రెస్ పథకాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలి.. సాకే నరేష్ క్విస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో జిల్లాస్థాయి క‌బ‌డ్డీ పోటీలు పల్లె పండుగ–3.0లో భాగంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. వికారాబాద్ జిల్లాలో లా & ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యటన, పోలీస్ స్టేషన్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతలక్ష్మీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పొలం వద్ద ఘర్షణలో వ్యక్తి మృతి రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ఎంఎల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రూప్ మాస్ కౌంటర్

Select Suryaa Now
ఎంఎల్సీ చంద్రశేఖర్ రెడ్డికి రూప్ మాస్ కౌంటర్

వైసీపీ నేతలవి అవగాహన లేని ఆరోపణలు…  చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం….  అభివృద్ధిని అడ్డుకోవడం మీ వల్ల కాదు

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి,ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు అవగాహన లేకుండా మంత్రి నారాయణపై, నెల్లూరు నగర అభివృద్ధిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. నెల్లూరు సిటీ జేమ్స్‌ గార్డెన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నెల్లూరు నగరంలో గత ప్రభుత్వం పేరుకుపోయేలా చేసిన చెత్తను ప్రస్తుత ప్రభుత్వం తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోందన్నారు. చెత్త నిర్వహణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు. చెత్త నిర్వహణలో గతంలో జరిగిన విధానాలు, ప్రస్తుతం చేపడుతున్న చర్యలపై పూర్తి అవగాహన లేకుండానే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు.
నెల్లూరు కార్పొరేషన్‌లో అనేక సంవత్సరాలుగా ట్రాక్టర్ల ద్వారానే చెత్త తరలించేవారని రూప్‌కుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వం క్లాప్‌ పథకం ద్వారా ఆటోలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటి ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కాంట్రాక్టర్‌ నుంచి ఆటోలను తీసుకెళ్లాయని చెప్పారు. ఈ వాస్తవాలు తెలియకుండా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.మంత్రి నారాయణ 200 ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూర్చి నగర పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కంప్యాక్టర్‌ వాహనాల వినియోగంతో నెలకు సుమారు రూ.40 లక్షల వరకు ఆదా అవుతోందని చెప్పారు.149 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌కు కేవలం నాలుగు స్వీపింగ్‌ మిషన్లు ఎలా సరిపోతాయో చంద్రశేఖర్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వీఆర్సీపై బహిరంగ చర్చకు సవాల్‌ :  వీఆర్సీ హైస్కూల్‌ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదని రూప్‌కుమార్‌ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వీఆర్సీకి వెళ్లి అక్కడ జరుగుతున్న అభివృద్ధి, నిర్వహణను పరిశీలిద్దామని సవాల్‌ చేశారు. మంత్రి నారాయణకు వీఆర్సీలో బస్సుల ద్వారా అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. వీఆర్సీ నిర్వహణ కోసం నెలకు సుమారు రూ.20 లక్షల సొంత నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 

శాశ్వత పట్టాలపై వాస్తవాలు తెలుసుకోండి :  భగత్‌సింగ్‌ కాలనీ పట్టాల విషయంలోనూ వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రూప్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులను అడిగి తెలుసుకుంటే, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు, ప్రస్తుతం ఇస్తున్న శాశ్వత పట్టాలకు ఉన్న తేడా తెలుస్తుందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దారుణంగా, బాధ్యతారహితంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. మంత్రి నారాయణ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలన్న వైసీపీ నేతల ప్రయత్నాలు ఫలించవని అన్నారు.ఓఎన్‌ఎంలో రూ.165 కోట్లు ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రూప్‌కుమార్‌ సవాల్‌ చేశారు. మంత్రి నారాయణ అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి నారాయణ కుటుంబంపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి వేధించినా, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు.వేల కోట్ల రూపాయలతో నెల్లూరు నగర రూపురేఖలు మారుతున్నాయని రూప్‌కుమార్‌ అన్నారు. చెత్తను తొలగించడం నుంచి రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యా మౌలిక వసతుల వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంత్రి నారాయణ విజ్ఞత కలిగిన నాయకుడని,చెత్త నుంచి సంపద సృష్టించే విధానాలతో నగరాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.చంద్రశేఖర్‌రెడ్డి ఆవేశంతో మాట్లాడటం మానుకుని ముందుగా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని సూచించారు.జరగని అవినీతిని నిరూపిస్తామంటూ బీరాలు పలకడం అర్థరహితమని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ఎంత చేసినా ముందుకు సాగుతున్న పనులను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరు నగరాభివృద్ధిపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, లేదంటే ప్రజల ముందు వైసీపీ నేతల ఆరోపణలే ప్రశ్నార్థకంగా మారతాయని సమస్కార హీనులుగా మిగిలిపోక తప్పదన్నారు.