BREAKING
రుచి కోసం తింటున్నామా లేక అలవాటుతో తింటున్నామా? ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై నిపుణుల హెచ్చరిక కేసులు త్వరగా తేల్చండి.. రికార్డులు పక్కాగా ఉంచండి!’ ఇంట్లో వంట తగ్గి ఫుడ్ డెలివరీలు పెరిగాయి: మన ఆహార సంస్కృతి ఎటు వెళ్తోంది? జిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక గిల్ డబుల్ సెంచరీ వీరవిహారం.. వెస్టిండీస్‌పై రికార్డు విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ భీమిలిలో అభివృద్ధికి బాట.. ‘కాఫీ విత్ కరణ్’: బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో విశేషాలు, వివాదాలు ఫోన్ మన చేతిలో ఉందా లేక మనమే ఫోన్ చేతిలో ఉన్నామా? డిజిటల్ వ్యసనంపై నిపుణుల హెచ్చరిక స్థానిక ఎన్నికలకు పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్త సమీక్ష సమావేశం.! ఏలూరు,మేజర్ న్యూస్ : జిల్లాలో పేదలకు సేవలో 2. O కార్యక్రమంలో భాగంలో ప్రతీ నియోజకవర్గంలో గ్రామ సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్రముఖ్యమంత్రి నారా రోజంతా కూర్చునే ఉద్యోగం చేస్తున్నారా? ఆరోగ్యానికి ముప్పు తెచ్చే ప్రమాదకర నిజాలు ఇవే నిద్రలేమి మనుషులను ఎంతలా దెబ్బతీస్తుంది? ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు ప్రతిరోజూ నడక ఎంత ముఖ్యం? వ్యాయామం చేయలేని వారికి వాకింగ్ ఎందుకు అద్భుతమైన అలవాటు? టీడీపీ, వైసీపీకి భిన్నంగా కొత్త రాజకీయ వేదిక: విజయసాయిరెడ్డి భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్

పిల్లలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

Select Suryaa Now
పిల్లలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

నారాయణపేట, సూర్య న్యూస్ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ లీగల్ సర్వీసెస్ ఆసీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్ ధ్వర్యంలో బుధవారం నారాయణపేట పట్టణంలోని బారంబావి సమీపంలోని బాలల, వృద్ధాశ్రమాలను లీగల్ సర్వీసెస్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక,  ఆశ్రమాలలోని వసతులు, భోజన సదుపాయాలు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, త్రాగు నీరు, పరిశుభ్రత, రిజిస్టరు, సీసీటీవీ పోటేగినిలను,  మూవ్మెంట్ రిజిస్టట్ తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్టాక్ ప్రతి రోజు ఎంట్రీ చెయ్యాలనీ, సమయానికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించి, మందులు ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలు, వృద్ధులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా సిబ్బందితో మాట్లాడుతూ చిల్డ్రన్స్ పై అన్ని విధాల 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా  సొంత ఇంటి వాళ్ళ మాదిరి  చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వానాకాలం ఎలాంటి పరిస్థితుల్లో అయినా వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్ళనివ్వద్దని  సిబ్బందినీ ఆదేశించారు. ఈ సందర్భంగా వారికి బాలల స్నేహపూర్వక న్యాయ సేవల పథకం - 2024, (సీనియర్ సిటిజన్లకు న్యాయ సేవలు - 2016 సంబంధించిన పథకాల గురించి అవగాహన కల్పించారు. వృద్ధులకు ఉచిత న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సదరం సర్టిఫికేట్లు మరియు బాలలకు వారి హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ టిఫిన్స్ కౌన్సిల్ కే లక్ష్మీపతి గౌడ్, పోలీస్ అధికారులు, సంబంధిత హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట*