మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ చిన్న శ్రీను వెంట కార్యకర్త లoతా బొత్స వెంటే
గుర్ల,సెప్టెంబర్30మేజర్ న్యూస్:మండలంలో గుజ్జంగి వలస గ్రామంలో కొంతమంది నేతలు వైఎస్ఆర్ పార్టీని వీడి చిన్న శ్రీను బాటలో వెళ్తారని ఊహగానాలకు బుధవారంతో తెరపడింది.బుధవారం వైయస్సార్ పార్టీ కార్యకర్తల సమావేశంతో తేటతెల్లమయింది.ఈ సమావేశానికి గ్రామంలో గల నేతలు,కార్యకర్తలు సమావేశం అయ్యారు.మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం పట్ల కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.ఈ నేపథ్యంలో గ్రామంలో గల నేతలు సమావేశమై చిన్న శ్రీను వైపు వెళ్ళాల బొత్స సత్యనారాయణ వైపు ఉండాలన్నది సమావేశం ముఖ్య ఉద్దేశం.ముందుగా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి రెడ్డి అప్పల నరసయ్య, అట్టాడ అప్పలరాజు, అట్టాడ చిన్నంనాయుడు , మరి కొంతమంది కార్య కర్తలు అభిప్రాయాన్ని వెల్లడించారు.మేము చిన్న శ్రీనుతో మాకు ఉన్న అనుబంధం చెప్పలేనిదని ఆయన అడుగుజాడల్లో ఉండాలనుకుంటున్నామని నిర్భయంగా తెలిపారు.మరి కొంతమంది నేతలుమాజీ ఎంపిపి అట్టాడ రామకృష్ణ,అట్టాడ లక్ష్మ నాయుడు అక్కడికి వచ్చిన కార్యకర్తలు మేమంతా వైయస్సార్ పార్టీ వీడే ప్రసక్తే లేదని అందులోనే కొనసాగుతామని తెలిపారు.మరి కొంతమంది నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.వెంపటాపు సూర్యనారాయణ,రెడ్డి మురళీధర్ రావు తమ అభిప్రాయాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీలో చేరబోమని వైయస్సార్ పార్టీ వీడి మరో పార్టీ వైపు వెళ్లేది లేదని నేతలు ముందు తేగేసి చెప్పారు.తమ అభిప్రాయాలను వెల్లడించడం పట్ల పార్టీ అధినేతల్లో అలజడి మొదలయ్యింది.తరువాత జరిగబోయే రాజకీయ పరిణామాలు పట్ల ఎలా ఉండబోతాయో అన్నది ప్రశ్నగా మిగలనున్నది.