BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

జొన్నవాడలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
జొన్నవాడలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

 ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 
 పల్లె పండుగ 3.0 కింద కోవూరు నియోజకవర్గానికి 217 పనులు.. రూ.9.16 కోట్ల మంజూరు
 గ్రామాల్లో రోడ్లు, కాలువలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :  కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని, మరొకవైపు అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ గ్రామాల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తోందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బుచ్చిరెడ్డిపాళెం రూరల్ పరిధిలోని జొన్నవాడ గ్రామం ఎస్టీ కాలనీలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కోవూరు నియోజకవర్గానికి రూ.9.16 కోట్లు : వీబీజీ రామ్‌ జీ – ‘పల్లె పండుగ 3.0’ పథకం కింద కోవూరు నియోజకవర్గానికి మొత్తం 217 పనులకు గాను రూ.9.16 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. మండలాల వారీగా నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 47 పనులకు గాను రూ.1.88 కోట్లు కేటాయించారు. అలాగే కొడవలూరు మండలంలో 56 పనులకు రూ.2.06 కోట్లు, ఇందుకూరుపేట మండలంలో 36 పనులకు రూ.2.00 కోట్లు, విడవలూరు మండలంలో 46 పనులకు రూ.1.62 కోట్లు, కోవూరు మండలంలో 32 పనులకు గాను రూ.1.60 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే గారు వెల్లడించారు.

స్థానిక నాయకుల భాగస్వామ్యంతోనే పనులు : మంజూరైన 217 పనులను తొలిపనిగా జొన్నవాడ ఎస్టీ కాలనీ సీసీ రోడ్డుతో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లోని ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ పనులన్నింటినీ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల భాగస్వామ్యంతోనే పూర్తి చేయించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. పర్యటనలో భాగంగా స్థానికులు కోరిన తాగునీటి ట్యాంకు, మురుగు కాలువలు, అంతర్గత రహదారుల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కూటమి అభ్యర్థులను ఆదరించాలి : రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. గ్రామాల్లో గుంతలు లేని రోడ్లు, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలంతా అండగా నిలవాలని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల మేరకు పోటీ చేసే కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోరారు.