కార్తీకం - ఆరోగ్యం, ఆనందం, మోక్షం ఇచ్చే మాసం - Dr Edupuganti Padmaja Rani
కార్తీకం - ఆరోగ్యం, ఆనందం, మోక్షం ఇచ్చే మాసం - Dr Edupuganti Padmaja Rani
కార్తీక మాసాన్ని కౌముది మాసం అని పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల. మరి ఇది వెన్నెల మాసమే. దీపావళి నుంచి నెల అంతా సంధ్యా దీపాలు వెలిగించడం ఆకాశ దీపాలు పెట్టడం ప్రధానంగా గుర్తించొచ్చు.
మనం చూసినట్లయితే సాధారణంగా మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది ఎందుకు అంటే శివుడు, విష్ణువు కూడా యోగ నిద్రలోంచి లేస్తారు. మనకి సాధారణంగా విష్ణుమూర్తి యోగనిద్దరిలోంచి లేస్తాడు అని తెలుసు శాస్త్రంలో చెప్పిన విషయం ఏమిటంటే ఆషాడ పూర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి వరకు శివుడు యోగనిద్రలో ఉంటాడు. గృహస్తులు ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీకం వరకు చాతుర్మాస వ్రతాలు ఆచరిస్తారు. సన్యాసులు ఆషాడ పూర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాతుర్మాసవ్రతాలు ఆచరిస్తారు. చివరి మూడు రోజుల మనకు అంటే నవమి దశమి ఏకాదశి ఈ మూడు రోజులు శ్రద్ధగా జపంతో కాలక్షేపం చేసినట్లయితే చాతుర్మాస వ్రత నియమాలు పాటించినట్లయితే, నాలుగు మాసాలు వ్రతాన్ని ఆచరించిన ఫలితం పొందుతారు. దీన్నే విష్ణు త్రిరాత్ర వ్రతం అంటారు. నాలుగు మాసాలు ఆ విధమైన ధర్మ బద్ధమైన, జీవనం గడిపితే సంవత్సరమంతా గడిపిన ఫలితం వస్తుంది. అంటే మూడు రోజులపాటు శ్రద్ధగా ధర్మాచరణ చేస్తే సంవత్సర కాలం ధర్మ చరణ చేస్తున్న ఫలితాన్ని ఇచ్చే ఘనమైన రోజులు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి దశమి ఏకాదశి.
ప్రారంభం నుంచి చూసినట్లయితే ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ఆ సంపద వృద్ధి చెందడానికి బలి పాడ్యమినాడు బలి పూజ చేయడం, దానాలు చేయడం, గోపూజ, గోవర్ధన పూజ చేయడం. ఇక విదియనాడు అనగా యమద్వితీయ నాడు భగిని హస్త భోజనం చేయడం, అంటే సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఆమెకు కావలసిన బహుమానాలు అందించడం ఆమె ఇచ్చే బహుమానాలు గ్రహించడం వలన అనుభవ యోగ్యమైన సంపద ఏర్పడుతుంది.
సోదరికి సోదరి బిడ్డలకి చేసిన దానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అదే విధంగా ఆమె సోదరునికి చేసినట్లయితే అది అక్షయమవుతుంది. సంపదను అనుభవియోగ్యంగా చేసుకోవడంలో ముఖ్య కృత్యాలలో ఈ రెండు ఉంటాయి.
ఏకభుక్తం చేయడం, శివారాధన చూసుకోవడం, అలాగే ధాత్రి తులసి పూజ చేసుకోవడం, ప్రతిరోజు దీప దానం చేయడం, మాసంతంలో వెండి కుందలో బంగారపు ఒత్తితో దీపం దానం చేయడం. అలాగే అతి ముఖ్యంగా నియమ పాలన చేస్తూ భగవత్ స్మరణ చేస్తూ సమయాన్ని గడిపినట్లుఅయితే శివ, కేశవులు ఇద్దరు కూడా అనుగ్రహించే మాసం. అంత గొప్ప మాసం.
పౌర్ణమి నాడు ప్రత్యేకించి సముద్రస్నానం చేయడం, నెల అంతా నదీ స్నానం చేయడం, ఇలా మనం సంవత్సరం మొత్తం సంపాదించాల్సిన పుణ్యాలంతా ఈ మాసంలో సులభంగా సాధించవచ్చు.
కార్తీక మాసంలో గృహ నిర్మాణానికి ఆరంభిస్తే ధన ధాన్య లాభం అని మత్స్య పురాణం చెప్తుంది. ఉసిరి చెట్టు మొదట్లో దేవారాధన చేయాలని, బిల్వపత్రాలతో శివునికి, తులసి దళాలతో తో విష్ణువుకి పూజ. సంధ్యాకాలంలో ఆకాశదీపం. ఆవునేతి దీపాలు.
సంవత్సరంలో పన్నెండు నెలల్లో భగవతారాధనకు తగిన మాసం కార్తీక మాసము అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రాతఃకాల స్నానం.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడ పడే ప్రదేశంలో కొలను నీటి స్నానాలు, కార్తీక వనభోజనాలు, ధాత్రిఫల భక్షణం, ధాత్రి ఫల దీపం, మిక్కిలి శ్రేష్టం.
నక్త వ్రతం, నక్త భుక్తి ఆరోగ్యకరం ఆచరణీయం.
ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలతో, భగవంతుని నామ సంకీర్తనతో, విశేషంగా మాసమంతా భక్తితో గడిపినట్లయితే ఆరోగ్యం ఆనందకరం.