BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఏఐతో ఉద్యోగాలు పోవడం లేదు.. మీరే దానికి పని అప్పగిస్తున్నారు: ఆర్జీవీ సంచలన పోస్ట్

Select Suryaa Now
ఏఐతో ఉద్యోగాలు పోవడం లేదు.. మీరే దానికి పని అప్పగిస్తున్నారు: ఆర్జీవీ సంచలన పోస్ట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్పొరేట్, ఐటీ ఉద్యోగుల తీరుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి నిప్పులు చెరిగారు. ఏఐ ఎప్పుడూ ఆఫీసులోకి వచ్చి మనుషులను బయటకు గెంటేయలేదని, ఉద్యోగులే రహస్యంగా తమ పనులను ఏఐకి అప్పగించి, తాము చేయని పనికి జీతాలు తీసుకుంటున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికపై ఆయన పంచుకున్న సుదీర్ఘ విశ్లేషణ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు రహస్యంగా ఏఐ సాధనాలను ఎలా వినియోగిస్తున్నారో రామ్ గోపాల్ వర్మ ఉదాహరణలతో సహా వివరించారు. విశ్లేషకులు డేటాను ఏఐకి ఇచ్చి సారాంశాన్ని తమ పేరుతో పంపుతున్నారని, డిజైనర్లు ఏఐ ద్వారా అనేక ఆప్షన్లు రూపొందించి స్వల్ప మార్పులతో సరిపెడుతున్నారని, కస్టమర్ సపోర్ట్ విభాగంలోనూ ఏఐ సాయంతో సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా తలుపులు మూసుకుని, బ్రౌజర్ హిస్టరీ చెరిపేసి, తామే స్వయంగా కష్టపడి పనిచేస్తున్నట్లు నటిస్తూ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ రహస్య వ్యవహారాన్ని కనిపెట్టడానికి సంస్థలకు గూఢచారులు గానీ, సీసీ కెమెరాలు గానీ అవసరం లేదని, సంస్థల ఆర్థిక గణాంకాలు, పనితీరు నివేదికలే అసలు నిజం చెబుతాయని వర్మ స్పష్టం చేశారు. ఏఐ ద్వారా వేగంగా పని పూర్తి కావడం, నాణ్యత పెరగడం, సంస్థల లాభాలు మెరుగుపడటంతో, ఉద్యోగాల కోత వచ్చినప్పుడు కంపెనీని లేదా టెక్నాలజీని నిందించడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఏఐ అలసిపోకుండా, సెలవులు లేదా ఫిర్యాదులు లేకుండా, అదనపు వేతనాలు ఆశించకుండా నిరంతరం పనిచేస్తుందని ఆయన విశ్లేషించారు.

భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే ఏఐ వాడకాన్ని దాచిపెట్టడం లేదా అపరాధ భావనతో ఉండటం కాదని, దానిని బహిరంగంగా, అత్యంత చురుగ్గా వినియోగించుకోవడమే సరైన మార్గమని రామ్ గోపాల్ వర్మ సూచించారు. భవిష్యత్తులో ఏఐని సమర్థంగా ఉపయోగించుకునే వారే, ఏఐని వాడని వారి స్థానాన్ని భర్తీ చేస్తారనే కఠిన వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.