BREAKING
పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మిట్స్‌లో ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్,ఓపెన్ సైన్స్‌పై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన జొన్నలు, రాగులు, సజ్జలలో ఏ మిల్లెట్‌లో ఏ పోషకాలు ఎక్కువ ఉంటాయో తెలుసా? ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను మర్యాదపూర్వకంగా కలిసిన పట్టణ సీఐ రాము నో అబ్జక్షన్ సర్టిఫికెట్ల జారీకి సింగిల్ విండో ఏర్పాటు చేయాలి మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌

చరణ్-సుకుమార్ ‘RC17’ అప్డేట్: లాకైన కథ.. ఫైనల్ నెరేషన్‌కు సిద్ధం!

Select Suryaa Now
చరణ్-సుకుమార్ ‘RC17’ అప్డేట్: లాకైన కథ.. ఫైనల్ నెరేషన్‌కు సిద్ధం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’పై టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ‘రంగస్థలం’ లాంటి అఖండ విజయం సాధించిన ఈ కాంబోలో, ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసిన దర్శకుడు సుకుమార్ పవర్‌ఫుల్ కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.  త్వరలోనే రామ్ చరణ్‌కు పూర్తి స్థాయి నెరేషన్ ఇవ్వడానికి సుకుమార్ సిద్ధమవుతుండగా, ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రీ-ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది దసరా కానుకగా పూజా కార్యక్రమాలు జరుపుకుని, నవంబర్ లేదా డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కేలా మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.  ఇదిలాఉంటే, ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుకుమార్ గత చిత్రాల సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, చరణ్ సరసన ఈ క్రేజీ బ్యూటీ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ ఫ్రెష్ కాంబినేషన్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తోంది.