BREAKING
నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు

సౌత్ సినిమాలకు అందుకే దూరమయ్యా.. వర్ణ వివక్షపై నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
సౌత్ సినిమాలకు అందుకే దూరమయ్యా.. వర్ణ వివక్షపై నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతీయ చిత్రసీమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే దక్షిణ భారత చిత్ర పరిశ్రమపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో తమిళం, తెలుగు భాషల్లో కబాలి, వెట్రి సెల్వన్, లయన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, గత కొన్నేళ్లుగా దక్షణాది సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, సౌత్ చిత్ర పరిశ్రమలో కథానాయికల ఎంపికలో తెల్లటి చర్మం ఉన్న ఉత్తరాది నటీమణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులు, అందమైన నటీమణులు ఉన్నప్పటికీ, భాష రాని వారికి అవకాశం ఇవ్వడంపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

దక్షిణాది భాషల్లో పట్టు ఉన్న స్థానిక నటీమణులను పక్కన పెట్టి, ముంబై నుండి వచ్చే నటీమణులను తీసుకురావడం భావ్యం కాదని రాధికా ఆప్టే పేర్కొన్నారు. బాష తెలియక డబ్బింగ్ చెప్పించుకునే నటీమణుల కంటే, స్థానిక భాష ప్రావీణ్యం మరియు అద్భుతమైన నటనా నైపుణ్యాలు ఉన్న దక్షిణ భారత నటీమణులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. వర్ణ వివక్షతో కూడిన ఇటువంటి పద్ధతులను ప్రోత్సహించడం తనకు ఇష్టం లేకే దక్షిణాది సినిమాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే సినిమా సెట్స్‌లో ఉండే వాతావరణం గురించి మాట్లాడుతూ, గతంలో పనులు స్నేహపూర్వకంగా, మర్యాదగా సాగినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిచయాల పేరుతో ఊచితంగా పనులు చేయించుకునే పరిస్థితి ఉండేదని, అది తనకు ఇబ్బందిగా అనిపించేదని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం రాధికా ఆప్టే తన రాబోయే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అక్క ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. 1980ల నాటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఆమె రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. కీర్తి సురేష్ తో కలిసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై రాధికా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.