BREAKING
పాఠశాలకు కంప్యూటర్ అందజేత జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సందీప్ కుమార్ గోల్డ్‌మన్ శాక్స్ అగ్రశ్రేణి అధికారులకు భారీగా 500 మిలియన్ డాలర్ల స్పెషల్ బోనస్! నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

గ్రాండ్‌గా ‘ప్రేమనే ఊరిలో’ సినిమా సక్సెస్ మీట్.. టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు

Select Suryaa Now
 గ్రాండ్‌గా ‘ప్రేమనే ఊరిలో’ సినిమా సక్సెస్ మీట్.. టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అచ్చమైన గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ప్రేమనే ఊరిలో ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్ థాంక్స్ మీట్ వేడుకను నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలో డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ, ప్రేమనే ఊరిలో సినిమా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుందని, ఇది ప్రతి ఒక్కరూ ప్రేమించి ఆస్వాదించాల్సిన మన మట్టి సినిమా అని కొనియాడారు. మన ఊరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో పాటు, కథలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయని తెలిపారు. ఒక చెట్టు గొప్పదనం, రైతు ప్రాముఖ్యత వంటి సామాజిక అంశాలను ఎంతో చక్కగా ఈ చిత్రంలో చూపించారని అభినందించారు. త్వరలోనే తాను కూడా ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూస్తానని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను పెద్ద విజయం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ మాట్లాడుతూ, తమ చిత్రానికి సాయికుమార్ లాంటి దిగ్గజ నటుడి ఆశీస్సులు లభించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఆయన అందించిన మాటలు తమకు ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు. సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా సినిమా చూడని వారు థియేటర్లలో చూసి మంచి అనుభూతిని పొందాలని కోరారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

హీరోయిన్ తపస్విని పునాచ మాట్లాడుతూ, కర్ణాటకలో ఘన విజయం సాధించిన తమ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాము స్వయంగా థియేటర్లను సందర్శించినప్పుడు ప్రేక్షకులు తమ పాత్రలను ఎంతగానో ఆస్వాదిస్తున్నారని తెలిపారు. సినిమాలో తమలాంటి పాత్రలు నిజ జీవితంలోనూ ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు చెబుతున్న ప్రశంసలు తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి విజువల్స్, అద్భుతమైన కథనంతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.