BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

‘వృషకర్మ’ విడుదల వేళ: శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య ప్రత్యేక పూజలు

Select Suryaa Now
‘వృషకర్మ’ విడుదల వేళ: శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య ప్రత్యేక పూజలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. శ్రీకాళహస్తిలోని ప్రముఖ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన నాగచైతన్య స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన నాగచైతన్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులను ఆప్యాయంగా పలకరించిన ఆయన, వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కార్తీక మాసంలో నాగచైతన్య ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, శ్రీకాళహస్తీశ్వరుడి ఆశీస్సులతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..