BREAKING
స్వయంపాకం అంటే ఆకలి తీర్చడం కాదు.. పవిత్ర యజ్ఞం! విశ్వనాథ సత్యనారాయణ తత్వమిదే! తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం! బత్తాయి తోటలను పరిశీలించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్! థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ!

నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్!

Select Suryaa Now
నాగ చైతన్య చేతుల మీదుగా 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్ లాంచ్: సెప్టెంబర్ 11న 'మహేంద్రగిరి వారాహి' గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్‌లో పూర్తిగా భిన్నమైన ఆధ్యాత్మిక మరియు మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి అమ్మవారి దివ్య శక్తి చుట్టూ అల్లుకున్న అంతుచిక్కని రహస్యాలు, సంఘటనలతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మరో పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. యువ సామ్రాట్ నాగ చైతన్య చేతుల మీదుగా ఈ చిత్రంలోని ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ (The Rage of Varahi) సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ పాట సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని చెప్పవచ్చు.

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. కడలి సత్యనారాయణ రాసిన సాహిత్యం అత్యంత శక్తివంతంగా ఉండగా, నకాష్ అజీజ్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటను వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు. వారాహి అమ్మవారి శక్తిని, సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్‌ను ఈ గీతం అద్భుతంగా ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.