BREAKING
సిద్ధార్థ్ దత్తాతో హీరోయిన్, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి వివాహం: వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం థియేటర్లలో శర్వానంద్ ‘భోగి’: సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందంటే? నాన్న కుట్టి మూవీ రివ్యూ: విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎలా మెప్పించిందంటే? పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? సూపర్ మార్కెట్ షాపింగ్ ఇక మీ చేతిలోనే.. తెలుగు రాష్ట్రాల్లో ‘సేల్స్ బీజ్’ యాప్ మరియు టెర్రాన్ ఈవీ స్కూటర్ల ప్రారంభం యథార్థ సంఘటనల ఆధారంగా ‘కూల్ రాఖీ కూల్’: ఘనంగా పోస్టర్, టైటిల్ లాంచ్ ఈవెంట్ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’: సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్న చిత్ర బృందం స్ఫూర్తి.. (కథ) కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. ఎన్నికల అధికారికి కుడి చేయి విరగడంతో కలకలం. రామగిరి సర్పంచిగా బెస్త ఆదిలక్ష్మి ఘనవిజయం కరీంనగర్‌లో అక్షర–అలెన్ జేఈఈ, నీట్ కోచింగ్ ప్రారంభం మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ డబ్బింగ్ షురూ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ స్పీడ్!

Select Suryaa Now
మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ డబ్బింగ్ షురూ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ స్పీడ్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'వాల్తేరు వీరయ్య' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా'. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు యూట్యూబ్‌లో అసాధారణ స్పందన రాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలంలో శరవేగంగా నిర్వహిస్తూ చిత్ర యూనిట్ నాన్-స్టాప్‌గా వర్క్ చేస్తోంది. సినిమాను అత్యున్నత ప్రమాణాలతో 'ది బ్లడీ బెంచ్‌మార్క్' (THE BLOODY BENCHMARK) స్థాయిలో తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్లుగా పని చేస్తున్నారు. అలాగే భాను-నందు ఈ సినిమాకు పదునైన డైలాగ్స్ సమకూరుస్తున్నారు. నూతన సాంకేతిక నిపుణులు, దిగ్గజ టెక్నీషియన్ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కావడంతో త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ రానున్నాయని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.