జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగింపు..ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం..
హైదరాబాద్, సినిమా డెస్క్:ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాలను సభ్య సంఘాలు, నాయకులు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
జానీ మాస్టర్ విషయంలో ఇప్పటికే కొనసాగుతున్న సహాయ నిరాకరణను కొనసాగించాలని అనుబంధ సంఘాలకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫెడరేషన్ నిర్ణయాలకు అనుగుణంగా అన్ని సభ్య సంఘాలు వ్యవహరించాలని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో జానీ మాస్టర్ వ్యవహారం మరోసారి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఫెడరేషన్ తదుపరి నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.