BREAKING
అంగన్వాడి కేంద్రం లో ఉత్సవాలు .! *ఉత్సవాల్లో సూపర్ వైజర్ తాడ్డి. శ్రీదేవి.! భారీ వర్షాలకు కూలిన ఇల్లు ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ భోగాపురం ప్రత్యేక అధికారిగా వెంకటేశ్వరరావు బాధిత కుటుంబాలను పరామర్శించిన బేబి నాయన ప్రజా సమస్యలపై లోకం మాధవి దృష్టి ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు

బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోన్న హనుమాన్ అంశ్.. రూ.360 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్!

Select Suryaa Now
బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోన్న హనుమాన్ అంశ్.. రూ.360 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా అత్యంత సాధారణంగా విడుదలైన చిన్న సినిమా హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో సునామీ సృష్టిస్తోంది. కేవలం రెండు కోట్ల రూపాయల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ఇప్పటికే ముప్పైై కోట్లకు పైగా మార్క్‌ను దాటేసి ఇప్పుడు ఏకంగా నాలుగు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం కంటెంట్ బలంతో ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాటోల రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణ చిత్రంగా బరిలోకి దిగిన ఈ సినిమా తాజాగా టాలీవుడ్ మరియు పాన్ ఇండియా లెవెల్‌లో పలువురు అగ్ర హీరోల సినిమాల రికార్డులను సైతం తిరగరాస్తోంది. యశ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ లైఫ్‌టైమ్ వసూళ్లను సైతం హనుమాన్ అంశ్ విజయవంతంగా దాటేసింది. టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు వందల నలభై కోట్ల వరకు వసూలు చేయగా, హనుమాన్ అంశ్ మాత్రం మూడు వందల అరవై కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్న చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడం పట్ల సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం విజయ్ నటించిన జన నాయగన్, యశ్ నటించిన టాక్సిక్ అలాగే రామ్ చరణ్ నటించిన పెద్ది వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను సైతం వెనక్కి నెట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ జాబితాలో నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసిన బాలీవుడ్ మూవీ బోర్డర్-2 మాత్రమే దీనికంటే ముందుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన హనుమాన్ అంశ్ చిత్రంలోని ఈ అరుదైన విజయాలు టాలీవుడ్ చరిత్రలో మైలురాళ్లుగా నిలుస్తున్నాయి.