BREAKING
థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ! వేణు ఊడుగుల సమర్పణలో 'చంద్రయాన్' మోషన్ పోస్టర్ రిలీజ్: సొంతంగా రాకెట్ తయారు చేసిన ముగ్గురు కుర్రాళ్ల సాహస యాత్ర! పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి శ్రీకృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్: మార్కండేయుడిగా నటుడు బ్రహ్మాజీ కొత్త గెటప్ వైరల్! కొండా సురేఖ రాజీనామా.. ఇక ఉప ఎన్నిక తప్పదా? వరంగల్ తూర్పులో రాజకీయ సమీకరణాలు ఎటు?

అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు!

Select Suryaa Now
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు!

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లీసా’. ఓం సాయిరామ్ ఆర్ట్స్ మరియు ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జవహర్ పవార్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను తెరకెక్కించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 'ఎస్సార్ కళ్యాణమండపం' fame శ్రీధర్ గాదె ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన వంటి అద్భుతమైన మరియు సుందరమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చూసిన రషెస్ అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్ నెలలో ‘లీసా’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.