స్వచ్ఛాంధ్ర అవార్డు అందుకున్న జెడ్పీ సీఈఓ డా. జె.అరుణ
విజయవాడ, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాల అమలు, ఉత్తమ పనితీరుకు గాను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. జె.అరుణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత అవార్డు లభించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చేతుల మీదుగా డా. జె.అరుణ షీల్డ్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు డా. జె.అరుణను అభినందించారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.