BREAKING
గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

విపత్తులలో సమయస్ఫూర్తియే రక్షణ

Select Suryaa Now
విపత్తులలో సమయస్ఫూర్తియే రక్షణ
  • శ్రీ చైతన్యలో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు

​పాలకొండ:  స్థానిక శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిమాపక అధికారి, పాలకొండ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.​ఈ సందర్భంగా ప్రమాదాలు సంభవించినప్పుడు భయాందోళన చెందకుండా సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాద సమయంలో దట్టమైన పొగ అలుముకుంటే నేలపై వంగి సురక్షిత ప్రాంతాలకు ఎలా చేరుకోవాలో ప్రత్యక్షంగా చూపించారు.
​అనంతరం అగ్నిమాపక పరికరాల వినియోగంపై విద్యార్థులకు, సిబ్బందికి ఆచరణాత్మక తర్ఫీదు ఇచ్చారు. గ్యాస్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు, ల్యాబోరేటరీలలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు. పాఠశాల దశలోనే ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ధైర్యం, ప్రాథమిక రక్షణ పద్ధతులపై పరిజ్ఞానం పెరుగుతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.​ఈ కార్యక్రమంలో పాలకొండ అగ్నిమాపక సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.