విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిహృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ నిలుస్తుందని పేర్కొంటూ, ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని, ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, పార్టీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు అందించాలని మేకపాటి విక్రమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
దుర్గమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరికీ సర్వశుభాలు కలగాలని, ప్రతి ఒక్కరూ విజయాలు సాధిస్తూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.