BREAKING
నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు!

విఎస్‌యూ కావలి జోన్ క్రికెట్ విజేత ‘జవహర్ భారతి’

Select Suryaa Now
విఎస్‌యూ కావలి జోన్ క్రికెట్ విజేత ‘జవహర్ భారతి’

​కావలి మేజర్ న్యూస్ :   విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) కావలి జోన్ క్రికెట్ ఫైనల్ టోర్నమెంట్ కావలిలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో జవహర్ భారతి కళాశాల జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, విఎస్ యు కళాశాల (కావలి) జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.  ​ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన ఈ రెండు జట్లు నెల్లూరులోని ప్రధాన యూనివర్సిటీ ప్రాంగణంలో జరగబోయే ‘సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంట్’లో పాల్గొంటాయని, అలాగే విఎస్‌యూ యూనివర్సిటీ అధికారిక క్రికెట్ జట్టు ఎంపిక కూడా ఇక్కడే జరుగుతుందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేవూరి మణికంఠ వెల్లడించారు.  ​అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి విఎస్‌యూ కావలి ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాసరావు, పులివర్తి భాస్కరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, సీనియర్ క్రికెట్ ప్లేయర్ విజయ్ హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా విజేతలకు, రన్నరప్‌లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు.  ​ఈ కార్యక్రమంలో పోలీస్ సురేష్, ఉపాధ్యాయులు సునీల్, లక్ష్మీనారాయణ, శివ, ఎం.ఎస్.ఆర్.పి.డి, జవహర్ భారతి కోచ్ రమణయ్య, ఏడుకొండలు, పలువురు అధ్యాపకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.