విద్యుత్ ఫిర్యాదులపై మంత్రి గొట్టిపాటి ఆకస్మిక తనిఖీ.. - 1912 కాల్‌సెంటర్ పనితీరుపై ఆరా -విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంత్రి తనిఖీ
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 1912 విద్యుత్ ఫిర్యాదుల కాల్‌సెంటర్ పనితీరును స్వయంగా పరిశీలించారు. కాల్‌సెంటర్‌లో ఫిర్యాదుల నమోదు, వాటిపై అధికారులు తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది స్పందన తదితర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఫిర్యాదు నమోదు చేసిన పలువురు వినియోగదారులతో మంత్రి స్వయంగా లైవ్‌లో మాట్లాడి విద్యుత్ శాఖ పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.