విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వం ద్యేయం
- మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ
పాచిపెంట: విద్యార్థుల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ద్యేయమని మండల విద్యాశాఖ అధికారి 1 కె వి సత్యనారాయణ అన్నారు.సోమవారం పాచిపెంట మండల పరిధిలో పి.కోనవలస మండలపరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి 1 కే వీ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఈ పర్యటనలో ఉదయం 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకూ ఫార్మాటివ్ పరీక్షలు నిర్వహణ, విద్యార్థులు ప్రమాణాలు పరీక్షించారు. పరీక్ష అనంతరం మధ్యాహ్న భోజనాన్ని సహపంక్తి గా విద్యార్థులతో కష్టసుఖాలు మాట్లాడుతూ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల ప్రకారం విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కు సూర్య నమస్కారాలు, ముస్తాబు మరియు 4 ఎస్ నిర్వహణ వీటితో విద్యార్థుల లో100 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేక కార్యక్రమాలు లులే (లెట్ అస్ లెర్న్ ఇంగ్లీష్) లో భాగంగా విద్యార్థుల మధ్య ఇంగ్లీష్ సంభాషణలు ప్రత్యక్ష పరిశీలన చేసారు. కిచెన్ గార్డెన్, టాయిలెట్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది తో మీటింగ్ లో అభివృద్ధి విషయంలో పలు సూచనలు ఇస్తూ ఉన్నత పాఠశాల అయ్యే విధంగా కృషి చేయాలని ప్రోత్సహించారు.పాఠశాల సిబ్బంది శ్రీను, రఘు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.