BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

విదేశీయుల సమాచారాన్ని 24గంటల్లో ఆన్లైను డిజిటలైజేషను చేయాలి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

Select Suryaa Now
విదేశీయుల సమాచారాన్ని 24గంటల్లో ఆన్లైను డిజిటలైజేషను చేయాలి  జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

 

 

విజయనగరం అక్టోబర్ 1, మేజర్ న్యూస్:

విదేశీయులకు ఆశ్రయం కల్పించే హెూటల్స్, గృహ యజమాన్యాలు, ఆసుపత్రులు, సత్రాలు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ వగైరా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వారి వద్ద ఆశ్రయం పొందే విదేశీయుల  వివరాలను అన్లైను డిజిటైలేజను ద్వారా ఎఫ్.ఆర్.ఆర్.ఓ. (ఫారనర్స్ రీజనల్ రిజిస్ట్రేషను ఆఫీసరు)/ఎఫ్.ఆర్.ఓ. (ఫారనర్స్ రిజిస్ట్రేషను ఆఫీసరు/సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) వారికి 24గంటల సమయంలోగా తెలియజేయాలని జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ అక్టోబరు 1న ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్  మాట్లాడుతూ - వివిధ పనులు నిమిత్తం వివిధ దేశాల నుండి జిల్లాకు విచ్చేసే విదేశీయుల వివరాలను 'ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్ నర్స్ చట్టం - 2025, సెక్షన్ 8 ప్రకారం తప్పనిసరిగా  https://indianfrro.gov.in/formiii/formc/login వెబ్ సైట్ ద్వారా 24గంటలలోగా ఎఫ్.ఆర్.ఆర్.ఓ/ఎఫ్.ఆర్.ఓ. కార్యాలయాలకు తెలపాలన్నారు. అలా వివరాలను తెలపని సంస్థల యాజమాన్యాలపై 'ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్నర్స్ చట్టం - 2025, సెక్షన్ 23(బి) ప్రకారం రూ.50 వేలు నుండి రూ. 1లక్ష వరకు జరిమానా లేదా 2 సం.లు నుండి 7 సం.లు వరకు జైలుశిక్ష విధించబడుతుందని జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

జిల్లాకు విచ్చేసే విదేశీయులు భారతదేశ చట్టాలను గౌరవించాలని, చెల్లుబాటులో ఉన్న వీసా, పాస్పోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఓ.సి.ఐ. (ఓవరిసిస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) భారతీయులు, దేశంలో నిర్వహించే ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ఓటు వేయరాదని, వ్యవసాయ భూములను కొనుగోలు చేయరాదని జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.