వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ ఆధ్వర్యంలో "మొలకపోలేరమ్మ "కు ప్రత్యేక పూజలు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలో వెలసియున్న " మొలక పోలేరమ్మ " దేవాలయంలో వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ అధినేత అడపా శ్రీధర్ రెడ్డి, జ్యోతి దంపతుల నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ అధినేత అడపా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలలో తమ కుటుంబ సమేతంగా పాల్గొని 'మొలకపోలేరమ్మ' ను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రత్యేక పూజల అనంతరం వి ఎస్ ఆర్ సీ ఫుడ్స్ నేతృత్వంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ మంగళ రాంప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.