BREAKING
శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్

వేతనాలు పెంపుదల చేయాలని విబిజి రామ్‌జీ సిబ్బంది ఎం ఎల్ ఏకు వినతి

Select Suryaa Now
వేతనాలు పెంపుదల చేయాలని విబిజి రామ్‌జీ సిబ్బంది ఎం ఎల్ ఏకు వినతి
  • ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి...ప్రభుత్వ విప్ జగదీశ్వరి
  • ఉద్యోగులకు న్యాయం జరిగేలా సహకరించాలని ఎం.ఎల్.ఎకు విజ్ఞప్తి
  • వి బి జి రామ్ జి సిబ్బంది దాసరి తేజేశ్వరరావు,టంకాల రామకృష్ణనాయుడు

గరుగుబిల్లి: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్‌జీ)ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ  మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ–వీబీజీ రామ్‌జీ పథకంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుమ్మలక్ష్మీ పురంలోని కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి సోమవారం వినతి పత్రం సమర్పించారు.గడిచిన ఏడు సంవత్సరాలుగా వేతనాలు, జీతభ త్యాల్లో ఎలాంటి పెంపుదల లేకపోవడం తో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల ను వి బి జి రామ్ జి సిబ్బంది దాసరి తేజేశ్వరరావు,టంకాల రామకృష్ణ నాయుడు తదితరులు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి తెలియజేశారు . తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలని గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు పరి ష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యోగ సంఘాలు సమర్పించిన న్యాయబద్ధమైన కోరికలు, దీర్ఘకాలిక సమస్యలను ఈనెల 10 వ తేదీలోగా పరిష్కరించేలా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుం దని పేర్కొన్నారు.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగుల కు న్యాయం జరిగేలా సహకరించాలని శాసనసభ్యులు తోయక జగదీశ్వరికి విజ్ఞప్తి చేశారు.ఈసందర్భంగా ఉద్యోగు ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వి బి జి రామ్ జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శాసనసభ్యులు తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో వి బి జి రామ్ జి కి సంబంధించిన ఉద్యోగు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.