వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కామవరపు కోట, సూర్య న్యూస్ : మండలంలో సోమవారం జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. కొత్తూరు బస్టాండ్ దగ్గర బస్సు మహిళపైకి దూసుకు వెళ్లిన ఘటనలో జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్దింటి లక్ష్మి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. లక్ష్మీని వైద్య చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం 108 లో తరలించారు. జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ నుండి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మీ మృతి చెందినట్లు తెలిపారు. లక్ష్మీ మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలోని తూర్పు ఎడవెల్లి గ్రామానికి చెందిన ఆరవ తరగతి చదివే మానుకొండ గౌతమ్ అనే బాలుడు చెరువు దగ్గరికి వెళ్లి కాలు జారడంతో చెరువులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గౌతమ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడు మృతితో ఎడవల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడు మృతి చెందిన సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ వారు తెలిపారు.
రిపోర్టర్ సుభాష్ కామవరపుకోట ఏలూరు జిల్లా