వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ
అహర్నిశలు శ్రమించి సంపాదించిన 4 లక్షల రూపాయలుకు పైగా నగదు దోచుకెళ్లిన దుండగులు అన్నం తిని వచ్చేలోపు నగదు అపహరణ విజయవాడ నుండి వచ్చి వెంకటగిరి పోలేరమ్మ జాతరలో చిరు వ్యాపారాలు చేసుకున్న నాగమణి, శ్రీనివాసరావు వెంకటాచలం పోలీసులకు మొరపెట్టుకున్న బాధితులు రాత్రనక,పగలనక,తిండి తినక సంపాదించిన ఒక్కొక్క రూపాయి ఊరు కానీ ఊర్లో పోగొట్టుకోవడంతో లబోదిబోమంటున్న బాధితులు విజయవాడ నగరానికి సంబంధించి శ్రీనివాసరావు, నాగమణి దంపతులు
వెంకటాచలం, మేజర్ న్యూస్ : జాతరలు పెద్ద పండుగలు సమయాల్లో ఆ ప్రాంతాలకు వెళ్లి టీవీ రిమోట్ లు, ఏసి రిమోట్ లు లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు, ఈ నేపథ్యంలో ఇటీవల వెంకటగిరిలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు వచ్చి 10 రోజులపాటు వెంకటగిరిలో అహర్నిశలు శ్రమించి తాము తెచ్చుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక్కొక్కటిగా అమ్ముకుని చేసుకున్న వ్యాపారంలో వచ్చిన నాలుగు లక్షల రూపాయలను ఓ గుడ్డలో చుట్టి, మిగిలిన కొంత చిల్లర నగుదును మరో మూటగా చుట్టి వెంకటగిరి నుండి విజయవాడకు ట్రక్ ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో తాము తెచ్చిన సామాన్లతో పాటు నగదును ఉంచి తేదీ 08.10.2026 న గురువారం నాడు వెంకటగిరి నుంచి విజయవాడకు బయలుదేరారు,సుమారు 2.30 నుండి 3 గంటల ప్రాంతంలో వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం ఆహారం కోసం ఆటో డ్రైవర్ ను అడగగా అతను సూచించిన ఓ షాపు వద్ద ఆగి ఆటో డ్రైవర్ చెప్పినట్లుగా ఆహారం తీసుకుని 5 నిమిషాల వ్యవధిలో ఆటో వద్దకు రాగా ఆటోలో వస్తువులు చిందర వందరగా పడి ఉండడం నాలుగు లక్షల రూపాయలు ఉంచిన నగదు కనిపించకుండా పోవడం చిల్లర నగదు ఉంచిన మూట మాత్రం అలాగే ఉండడంతో గుండె పగిలినంత పనైనా బాధితులు దగ్గర్లోని వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనను వివరించగా, వెంకటాచలం సీఐ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం పై దర్యాప్తు జరిపినట్టు, అక్కడ సీసీ కెమెరాలు ఏమి లేకపోవడం తో మొదట డ్రైవర్ ను అనంతరం బాధితులను విచారించినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఏమి చేయాలో బాధితులే తెలపాలంటూ అడిగినట్లు సమాచారం... తాము సరుకు అప్పుగా తెచ్చుకుని జాతర సమయాల్లో అమ్ముకుని వచ్చే కొంచెం ఆదాయం ఉంచుకుని వస్తులపై తెచ్చుకున్న అప్పు తిరిగి చెల్లించాలని ఇలాంటి పరిస్థితుల్లో నగదు మొత్తం పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుల బాధ వర్ణనాతీతం,, ఓవైపు డబ్బులు పోగొట్టుకొని మరోవైపు ఒకటిన్నర రోజు నుండి వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్ద,ఇక్కడే ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు,, నెల్లూరు జిల్లాలో ఓవైపు నేరాలు జరుగుతుండగా ఇప్పుడు దారిదోపిడి సైతం విస్మయానికి గురిచేస్తుంది... వెంకటాచలం పోలీసులు బాధితుల వద్ద కనీసం ఫిర్యాదునైన స్వీకరించాలి.. భవిష్యత్తులో దొంగతనానికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా ఆధారాలు లభించినా బాధితులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఫిర్యాదు తీసుకోకపోవడం గమనార్హం.