వెల్దుర్తి వైకాపా కన్వీనర్ రవీంద్రనాథ్ రెడ్డి హౌస్ అరెస్టు
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి రూలర్ న్యూస్:మండల వైకాపా కన్వీనర్ బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డిని స్థానిక పోలీసులు గురువారం ఉదయం ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ ఎం. నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది రవీంద్రనాథ్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను గృహ నిర్బంధం చేశారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానికంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం